21-07-2024 12:56:29 PM
ఖమ్మం: పెద్దవాగు ప్రాజెక్టును వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. పెద్దవాగు ఆనకట్టకు పడిన గండ్లు, నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు న్యాయం చేస్తామంటూ మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. మరమ్మతు పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పెద్దవాగు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిన విషయం తెలిసిందే.