14-09-2025 10:54:04 AM
రైతు రాజ్యం కాదు.. కాంగ్రెస్ పార్టీ దగా రాజ్యం
దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ: ఒక్క సంచి యూరియా కోసం రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్(Former MLA Ramavath Ravindra Kumar) అన్నారు. ఆదివారం పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కావాలని మొత్తుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉందని ఆయన అన్నారు. రైతులు యూరియా కోసం అరిగోస పడుతుంటే కనీసం ఈ ప్రభుత్వంలో చలనం లేదు అని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేవరకొండ నియోజకవర్గంలో యూరియా కొరత ఉందని తెలిపారు. వెంటనే ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.