09-08-2024 06:49:50 PM
హైదరాబాద్: నల్గొండ జిల్లా పెద్దవూరు మండలంలో సుంకిశాల వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టులో సెడ్ వాల్ కూలింది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం సుంకిశాలలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సుంకిశాల ఘటన చిన్నది.. నష్టం కూడా తక్కువే అని పేర్కొన్నారు. సుంకిశాలకు జరిగిన నష్టాన్ని గుత్తేదారు భరిస్తారని, దీంతో ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని మంత్రి వెల్లడించారు.
నిర్మాణం పూర్తికి ఒకట్రెండు నెలలు ఆలస్యమవుతుందని, ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని, డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తామన్నారు. సుంకిశాల పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగాయని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ కూలిన ఘటన ప్రభుత్వానికి సోషల్ మీడియా ద్వారానే తెలిసిందని మంత్రి తెలిపారు. సుంకిశాల ఘటన జరగ్గానే ప్రభుత్వం స్పందించి వాటర్ వర్క్స సిబ్బందిని అప్రమాతం చేయడంతో వారు విచారణ చేస్తున్నారు. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయిస్తామన్నారు.