calender_icon.png 12 July, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు.. తెలంగాణ ఎంపీలకు చోటు

09-08-2024 05:13:35 PM

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లును పరిశీలించేందుకు 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసింది. 21 మంది లోక్ సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో జేపీసీ ఏర్పాటైంది. నిన్న వక్ఫ్ సవరణ చట్టం బిల్లుపై జేపీసీకి కిరణ్ రిజిజు ప్రతిపాదించింది. జేపీసీలో తెలంగాణ ఎంపీలు డీకే అరుణ, మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఏపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, విజయసాయితోపాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలకు జేపీసీలో ప్రభుత్వం చోటు కల్పించింది. తదుపరి పార్లమెంటు సమావేశాల్లో మొదటి వారంలోగా కమిటీ నివేదించనుంది.