09-08-2024 07:34:54 PM
హైదరాబాద్: సుంకిశాల ప్రాజెక్టును జిల్లా ఇన్ చార్జ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందర్శించారు. సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణ పనులు బీఆర్ఎస్ హయంలోనే జరిగాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. సుంకిశాల ప్రాజెక్టు కూలిన ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేస్తుందన్నారు. జరిగిన నష్టాన్ని నిర్మాణ సంస్థే భరిస్తుందని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల తెలిపారు.