calender_icon.png 4 August, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్లు.. ఆడగలరు,పాడగలరు

04-08-2025 12:00:00 AM

నాటక ప్రదర్శనతో ఔరా అనిపించుకున్న కరీంనగర్ వైద్యులు

కరీంనగర్, ఆగస్టు 3(విజయ క్రాంతి): మ నకు వైద్యులను చూడగానే రోగాలను న యం చేసే దేవళ్లుగా భావిస్తాం. కరీంనగర్ వై ద్యులు నాటక ప్రదర్శనతో ఆట పాటలతో మనసును ఉల్లాస పరిచి ఔరా అనిపించుకున్నారు. తమలోని కళాత్మకతను ప్రదర్శించా రు. కరీంనగర్ కు చెందిన సీనియర్ డాక్టర్లు భూంరెడ్డి, రవీందర్ రావు లు మరణించడం తో వైద్యుల దినోత్సవాన్ని వాయిదా వేసుకున్న ఐఎంఏ కరీంనగర్ బైపాస్ రోడ్డులోని వి కన్వెన్షన్ లో కార్యక్రమం నిర్వహించింది. ఐ ఎం ఏ జిల్లా అధ్యక్షడు డాక్టర్ ఏనుమల్ల నరేష్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా దాన వీర శూరకర్ణ, సుభద్ర పరిణయం వంటి పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. పాండవులు నిర్మించిన మయసభ, కర్ణునికి అంగరాజ్య పట్టాభిషేకం, కౌరవ పాండవ యుద్ధానికి ముందు శ్రీ కృష్ణుడి సాయం కోసం దుర్యోదనుడు, అ ర్జునుడు వెల్లినప్పుడు జరిగిన వాదనలతో పాటు సుభద్ర పరిణయం నాటకాలను డాక్ట ర్లు ప్రదర్శించిన తీరు పలువురిని ఆకట్టుకుం ది.

దుర్యోదనుడి పాత్రలో డాక్టర్ ఎస్ రవి కుమార్, కృష్ణుడి పాత్రలో డాక్టర్ వెంకటేశ్వ ర్లు, అర్జునుడి పాత్రలో డాక్టర్ తిరునాధర్ హవాభావాల ప్రదర్శించారు.నాలుగైదేళ్ల క్రి తం వరకు డాక్టర్స్ డే అనగానే సన్మానాలు, సత్కారాలకు మాత్రమే పరిమితం అయ్యేది. కరీంనగర్ ఐఎంఏ మాత్రం తమ సంఘ స భ్యుల్లో నూతనోత్తేజం నింపే ప్రయత్నం చే స్తూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చు ట్టింది.

మానసికంగా ఉల్లాసం నింపేందుకు కార్యక్రమాలు తీసుకోవడంతో తమలోని క ళలను ప్రదర్శించేందుకు డాక్టర్స్ డే వేడుకలను వేదికగా మల్చుకుంటున్నారు. సినిమా పాటలకు స్టెప్పులు వేయడం, హస్యరసాన్ని పండించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కేవలం పౌరాణిక నాటకాలే కా కుండా ఇతరాత్ర ప్రదర్శనలు కూడా చేపట్టా రు. ఈ సందర్భంగా వివిధ సినిమా పాటలకు డ్యాన్సులు చేసి సభికులను ఆనంద ప రవశంలో ముంచెత్తారు.

నేటి తరం వైద్యులే కాకుండా సీనియర్ వైద్యులు కూడా వేదికపై స్టెప్పులేశారు. అలనాటి పాటలపై నృత్యం చేసిన వెటరన్ డాక్టర్లు సరికొత్త జోష్ నింపా రు. అనస్తీషియా, పెడియాట్రిక్, గైనిక్ ఇలా ఆయా రంగాల్లో నిపుణులైన వైద్యులు గ్రూ పులుగా ఏర్పడి కళలను ప్రదర్శించారు.

ఈ సారి వేదికపై ప్రదర్శనలు చేసేందుకు ఎక్కు వ సంఖ్యలో బృందాలు ముందుకు రావడంతో డాక్టర్లు నూతన ఒరవడి మొదలైనట్ట యింది. నేటి తరం నుండి వెటరన్ డాక్టర్ల వ రకు వివిధ కళా రూపాల ప్రదర్శనతో డాక్ట ర్స్ డే అత్యంత వైవిద్యంగాకొనసాగింది.