calender_icon.png 4 August, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామ పంప్ హౌస్ ట్రయల్ రన్ ను ప్రారంభించిన మంత్రులు

11-08-2024 03:22:58 PM

భద్రాచలం: సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్-2ను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పరిశీలించి పంప్ హౌస్ ట్రయల్ రన్ ను ప్రారంభించారు. సీతారామ ప్రాజెక్టు 2,3 లిప్ట్ ఇరిగేషన్లను ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

పంద్రాగస్టునే రూ.2 లక్షల రైతుల పంట రుణమాఫీ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని, 2026 ఆగస్టు 15 నాటికి ఆయుకట్టులోని ప్రతి ఎకరానికి నీరాందిస్తామని ఉత్తమ్ వెల్లడించారు. రీడిజైన్ పేరుతో గతపాలకులు రూ.8 వేల కోట్లు వృథా చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

గత ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని, పంప్ హౌస్ ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సత్తుపల్లి ట్రంక్ పనుల్లో యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయాలన్నారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు కొనసాగుతాయని తుమ్మల వెల్లడించారు.