calender_icon.png 4 August, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద ప్రవాహం.. 10 గేట్లు ఎత్తివేత

11-08-2024 06:18:31 PM

హైదరాబాద్: నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నీటిపారుదల శాఖ అధికారలు ఆదివారం సాగర్ 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 587.30 అడుగులు చేరింది. నాగార్జునసాగర్ నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ 305.68 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి ఇన్ ఫ్లో 1,02,746 క్యూసెక్కులు ప్రవాహం వస్తుండగా, ఔట్ ఫ్లో 1,02,746 క్యూసెక్కులు వదులుతున్నారు.

నాగార్జునసాగర్ జాలాశయం కుడి, ఎడమ కాల్వలకు 26 క్రస్టుగేట్లలో ప్రస్తుతం12 గేట్లను మూసి 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.  కాగా, ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద నీరు పోటెత్తుంది. ఈ నేపథ్యంలో  ఆదివారం అధికారులు 10 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ రోజు ఆదివారం కావడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు సందర్శంచిందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో పోటెత్తాడంతో ముందు జాగ్రతగా మెయిన్ డ్యామ్, పవర్ హౌస్ పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించవద్దని పోలీసులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.