14 May, 2026 | 6:56 PM

శంకర్‌యాదవ్‌కు మంత్రుల నివాళి

21-06-2024 12:21 AM

కంటోన్మెంట్, జూన్ 20: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ చౌరస్తాలోని ఎస్వీఐటీ కళాశాల ఆడిటోరియంలో గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తలసాని శంకర్‌యాదవ్ దశదిన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అయిలయ్య, లక్ష్మణ్‌తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్ అలీ, మల్లారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, జోగు రామన్న, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, మహేశ్‌కుమార్‌యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు శంకర్‌యాదవ్ చిత్రపటానికి నివాళులర్పించారు.