ఉద్యోగ భద్రత కల్పించాలని స్పీకర్‌కు వినతి
21-06-2024 12:22 AM
వికారాబాద్, జూన్ 20(విజయక్రాంతి): పురపాలక శాఖలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో బిల్ కలెక్టర్లుగా పని చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా ఉద్యోగులు గురువారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. గత 20 ఏళ్లుగా బిల్ కలెక్టర్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేకపోవడంతో తమ బతుకులు దారుణంగా ఉన్నాయని వాపోయారు. ఈ విషయంపై సీఎం, మంత్రి మండలి దృష్టికి తీసుకెళ్తానని స్పీకర్ తెలిపారు. వినతిపత్రాన్ని అందజేసిన వారిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చందర్‌సింగ్, జగదీష్, అరుణ్, మైపాల్, సోమయ్య, శ్రీహరి ఉన్నారు.






