నిబంధనలు అమలు పరచాలి
30-05-2024 12:05 AM
మైనర్లకు ద్విచక్ర వాహనాలు నడపడానికి ఇచ్చే తల్లిదండ్రులకు ఇక మీదట రూ.25 వేలు జరిమానా విధించనున్నట్టు వార్తలు రావడం ఆహ్వానించదగ్గది. అలాగే, రోడ్డుపై ఓవర్ స్పీడుతో వెళ్లినందుకు రూ.2 వేలు, లైసెన్సు లేకుంటే రూ. 500 చలానా విధించనున్నట్టు తెలిసింది. కనీసం ఈ రకంగానైనా ప్రమాదాలు తగ్గితే మంచిది. గల్లీల్లో లేదా కాలనీల్లో లేదా దగ్గరే అంటూ చిన్న కారణాలతో లైసెన్సు లేని మైనర్లకు టూవీలర్స్ ఇవ్వడం ఇకనైనా మానుకోవాలి.
-రాజేందర్‌రెడ్డి, బోధన్






