5 May, 2026 | 1:25 AM

పిల్లల అమ్మకం అమానవీయం

30-05-2024 12:05 AM

నెలలు కూడా నిండని చిన్నారులను కొందరు డబ్బులకు కక్కుర్తి పడి సంతానం లేని వారికి అమ్ముకుంటున్న వైనం అమానవీయం. ఈ అక్రమానికి సంబంధించిన ముఠాను రాచకొండ పోలీసులు ఆట కట్టించినట్లు వార్త వచ్చింది. ఈ సందర్భంగా పదహారు మంది చిన్నారులను కాపాడినట్లు తెలిసింది. వారిని శిశు సంరక్షణ కేంద్రానికి అప్పగించి పోలీసులు మంచి పని చేశారు. ఈ పిల్లల్లో ఒక నెల వయస్సు బేబీ నుంచి 2 సంవత్సరాల వాళ్లు కూడా వున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చిన్నారి విక్రయం గురించిన సమాచారాన్ని పోలీసులకు అందించిన యువకుణ్ణి అభినందించి తీరాలి.

 -కిరణ్మయి శేఖర్, ఖమ్మం