13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

అట్టహాసంగా శ్రీరామ శోభాయాత్ర

27-03-2026 10:47 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలోని 17వ వార్డులో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్రను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ శోభాయాత్ర శ్రీ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై పాత బస్టాండ్ మీదుగా శ్రీ కోదండ రామాలయం వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడారు. శ్రీరామనవమి పర్వదినం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకన్నారు. శ్రీరాముడి ఆచరణీయమైన జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో సత్యం, ధర్మం, న్యాయం నిలవాలంటే శ్రీరాముడి మార్గంలో నడవాలని ఆయన సూచించారు. ప్రజలు అందరూ ఐక్యంగా ఉండి పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.