09-12-2025 02:05:53 PM
- మిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి అనంతుల శ్రీనివాస్
నూతనకల్,(విజయక్రాంతి): మండల పరిధిలోని మిర్యాల గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అనంతుల శ్రీనివాస్ మంగళవారం గ్రామంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు. అనంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలను కోరారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు, పేదలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యుల అభ్యర్థులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.