calender_icon.png 10 December, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ పేరు తల్చకుండా సీఎంకు రోజు గడవదు

09-12-2025 02:03:12 PM

డిసెంబర్ 9 చరిత్రలో నిలిచిపోయే రోజు

సర్పంచ్ అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి,(విజయక్రాంతి): డిసెంబర్ 9 చరిత్రలో నిలిచిపోయే రోజు అని  తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9 న విజయ్ దివాస్ ను పురస్కరించుకొని  మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పాలభిషేకం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు దిశా నిర్దేశం చేస్తూ మాట్లాడారు.

కేసీఆర్‌ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మండలంలో గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం లోనే జరిగిందని గుర్తు చేశారు.తాను ఎమ్మెల్యేగా పదేళ్లూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమించానని, తనకు కేటాయించిన సీడీఎఫ్‌ నిధులతోపాటు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, డీఎంఎఫ్‌టీ, సుడా నిధులన్నీ అభివృద్ధి పనులకే కేటాయించినట్లు చెప్పారు. రెండేళ్ల క్రితం వరకు కళకళలాడిన పల్లెలు, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వీటన్నింటినీ అర్థం చేసుకొని పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా చేయడంతో గత ఎన్నికల్లో గిరిజనులు తమ తండాల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవం చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులు ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరిస్తూ, భయబ్రాంతులకు గురిచేస్తూ బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీ ల పేరుతో రూ.72 వేల కోట్లు ఖర్చు పెట్టామని ప్రభుత్వం గొప్పలకు పోతున్నదని, క్షేత్రస్థాయిలోకి వెళ్తే కళ్యాణలక్ష్మి, షాదీముభారక్‌ పథకాలకు తులం బంగారం, యువతులకు ఇస్తామన్న స్కూటీలు, మహిళలకు రూ.2,500ల ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు.

ఇక రైతుబంధు నాట్ల సమయానికి వస్తుందన్న గ్యారెంటీ కూడా లేకుండా పోయిందన్నారు. నాట్లకు రావాల్సిన రైతుబంధు.. ఓట్లకు ఓట్లకు ఇచ్చే పథకంలా తయారైందని ఎద్దేవా చేశారు. పదేళ్లలో ఏనాడూ లేని యూరియా కష్టాలు కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ కనిపించాయని చెప్పారు.స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు.మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, అత్యధిక సర్పంచ్‌ స్థానాలను గెలుచుకొని బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలో వేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు, ఎస్ ఏ రజాక్, మాజీ ఎంపీపీ గుండ గాని కవితా రాములు గౌడ్,మాజీ వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, నాయకులు పులుసు యాదగిరి, వివిధ మండలాల అధ్యక్షులు  రఘునందన్ రెడ్డి, కల్లెట్లపల్లి ఉప్పలయ్య, ఉపేందర్, సోమేశ్వర్, వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.