22-11-2025 12:57:35 AM
-మిస్ యూనివర్స్- 2025గా ఫాతిమా బాష్
-అవమానించిన చోటే విజేతగా నిలిచిన మిస్ మెక్సికో
-పోటీలో టాప్12కు చేరనిభారత్
థాయ్‌లాండ్, నవంబర్ 21: మిస్ యూనివర్స్ కిరీటం ఈ ఏడాది మెక్సికో అం దాల భామను వరించింది. థాయ్‌లాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్‌ేొ్స2025 పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ విజేతగా నిలిచారు. ప్రపంచ దేశాల నుంచి 120 మందికి పైగా పోటీల్లో పాల్గొనగా వారందరినీ వెనక్కి నెట్టి 25ఏళ్ల అందాల భామ కిరీ టాన్ని దక్కించుకున్నారు.
రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీనర్ సింగ్, రెండో రన్నరప్‌గా వెనిజులాకు చెందిన స్టిఫానీ అ బాసలీ నిలిచారు. ఈ పోటీలో భారత్ నుం చి రాజస్థాన్‌కు చెందిన మణికా విశ్వకర్మ ప్రాతినిధ్యం వహించినప్పటికీ కిరీటం దక్కించుకోలేకపోయారు. మణిక.. స్విమ్‌సూట్ రౌండ్‌తో టాప్ 30 వరకే చేరుకుంది. టాప్ 12లో నిలవకపోవడంతో పోటీ నుంచి నిష్క్రమించింది. మిస్ యూనివర్స్ పోటీల్లో మన బ్యాడింటన్ స్టార్ సైనా నెహ్వాల్ న్యాయనిర్ణేతల్లో ఒకరిగా ఉండడం విశేషం.
ఒక్క సమాధానంతో..
‘భద్రత, సమాన అవకాశాల విషయం లో మహిళలు ఎన్నో అడ్డంకులు, అవమానాలు ఎదుర్కొంటున్నారు.. అలా అని నేటి తరం తమ భావాలను వ్యక్తం చేసేందుకు ఏ మాత్రం వెనుకాడదు.. మార్పు కో రుకునే ధైర్యాన్ని కలిగి ఉన్నారు.. మా గళాన్ని వినిపించేందుకు.. మార్పుకోసం ఇక్కడ నిల్చొని ఉన్నాం.. చరిత్ర సృష్టిస్తాం’ అని ఫాతిమా చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను మె ప్పించింది.. ఆ మాటలే ఆమెకు విశ్వసుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టాయి.
మిస్ యూనివర్స్ పోటీల్లో ఆధునిక యుగంలో మహిళగా మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి? మ హిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృ ష్టించేందుకు మీరు ఈ కిరీటాన్ని ఎలా ఉపయోగిస్తారు?అని తుదిరౌండ్‌లో జడ్జిలు సంధించిన ప్రశ్నలకు ఫాతిమా బాష్ దృఢ సమాధానమే విశ్వసుందరిని చేసింది. ఫాతి మాబాష్(25) మెక్సికో మోడ ల్. ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూ ర్తిచేశారు. ఈ సెప్టెంబర్‌లో మిస్ మెక్సికోను దక్కించుకున్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదు డుకులు, అవమానాలు ఎదుర్కొన్నారు.
పోటీలు ప్రారంభమైనప్పటి నుంచే..
మిస్ యూనివర్స్ పోటీలకు ముందే ఫా తిమా వార్తలో నిలిచారు. పోటీల్లో భాగంగా ఫాతిమా ఓ షూట్‌కు హాజరుకాలేదు. ‘మనకు అణచివేత ఎదురైనప్పుడు మనం గట్టి గా సమాధానం ఇవ్వాలి.. అందుకు ఫాతి మా ఒక ఉదాహరణ’అని మెక్సికో అధ్యక్షురాలు ఫాతిమాను అప్పుడు కొనియాడారు.