calender_icon.png 26 May, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకేరోజు 108 ‘ఎపిక్ న్యూ స్విఫ్ట్’ కార్లను విక్రయించిన వరుణ్ మోటార్స్

25-05-2025 12:58:17 AM

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): భారతదేశంలోనే నెంబర్‌వన్‌గా గుర్తింపుపొందిన మారుతీ సుజుకీ కార్ డీలర్ వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ బ్రాంచీ వారు శనివారం ఒకేరోజు 108 ఎపి క్ న్యూ స్విఫ్ట్ మోడల్ కార్లను విక్రయించారు. ద ఎపిక్ న్యూ స్విఫ్ట్ మోడల్‌కు సంబంధించి జెడ్ సిరీస్ వాహనాలు మార్కెట్‌లోకి వచ్చి ఏడాది కావొస్తోంది.

ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఈ మోడల్‌కు చెందిన దాదాపు 1.8 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. స్విఫ్ట్ వాహనాల్లో నాలుగో తరగానికి చెందిన ఈ ఎపిక్ న్యూ స్విఫ్ట్ కార్లు అధిక మైలేజీని ఇస్తూ వినియోగదారుల మన్ననలు చూరగొంటున్నాయి. ఈ కారు లీటర్ 25.75 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వడం విశేషం.

ఈ కారు మార్కెట్‌లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భం గా ‘మాస్ డెలవరీ ఆఫ్ న్యూ ఎపిక్ స్విఫ్ట్’ కార్యక్రమాన్ని చేపట్టామని, అందులో భాగంగా శనివారం ఒక్కరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో 555 కార్లను విక్రయించినట్టు వరు ణ్ మోటార్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.