21 March, 2026 | 1:34 PM

Breaking News

తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •  

పటాన్‌చెరులో నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం

20-09-2024 02:59 PM

సంగారెడ్డి, (విజయక్రాంతి): బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని అదృశ్యం అయిందని కుటుంబ సభ్యులు పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్‌చెరు పట్టణంలోని సాయిరాం నగర్ కాలనీకి చెందిన సాత్విక (22) బిఎస్సి నర్సింగ్ చదువుతుందన్నారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో తాను ఫెయిల్ అయ్యానని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని తన ఫోన్లో వాయిస్ మెసేజ్ రికార్డు చేసి ఇంట్లో ఫోన్ పెట్టి పోయిందన్నారు. స్వాతిక కనిపించకపోవడంతో తమ్ముడు సాయికిరణ్ పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ్ముడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.