14-07-2025 12:06:47 AM
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు/అమీన్ పూర్, జులై 13 : అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలకు సైతం ఇంటింటికి రక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని నవ్య కాలనీలో మిషన్ భగీరథ ద్వారా ఏర్పాటు చేసిన ఇంటింటికి మంచినీటి నల్ల కనెక్షన్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, హెచ్‌ఎమ్డబ్ల్యూఎస్ డీజీఎం చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు అండగా ఉంటాం
దివ్యాంగులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యేను పలువురు దివ్యాంగులు ఆయనను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో 450 మంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు అందించామని, భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
భానూరులో బోనాల పండుగ
పటాన్ చెరు మండల పరిధిలోని భానూరులో ఆదివారం ధన మైసమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. బోనాల పండుగలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, దశరథరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు, ప్రజలుపాల్గొన్నారు.