13 May, 2026 | 6:59 PM

పదోన్నతుల్లో పొరపాట్లను సవరించాలి

21-06-2024 01:21 AM

మల్టీజోన్-2లో షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలి

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు జాక్టో వినతి

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): మల్టీజోన్-1లో బదిలీలు, పదోన్నతులలో జరిగిన పొరపాట్లను సవరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి (జాక్టో) కోరింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు జాక్టో చైర్మన్ సదానందంగౌడ్, ట్రెజరర్ కృష్ణుడు గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. మల్టీజోన్ ఒక ఉపాధ్యాయునికి మూడు ప్రమోషన్లు వచ్చాయని, మిగిలిన రెండు చోట్ల ఖాళీల్లో ఇతరులకు అవకాశం కల్పించాలని కోరారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పీఎస్ హెచ్‌ఎం 5,571 పోస్టులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మల్టీజోన్ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, అధికారులకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మల్టీజోన్ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం చేపట్టాలని వారు కోరారు.