దేవాలయాలు భారత దేశ సంస్కృతికి సజీవ సాక్షాలు
ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
రాజాపూర్ ఆగస్టు 26: దేవాలయాలు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు భక్తి భావాలకు నిలువెత్తు సాక్షాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఖానాపూర్ గ్రామంలో చిత్తనూరు రవికుమార్ గుప్తా నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని, గ్రామ ప్రజలకు ఆధ్యాత్మికంగా ఎంతో ఉపయోగకరంగా ఉండాలని ఆకాంక్షించారు. దైవభక్తి, ఆధ్యాత్మికతతో గ్రామాల్లో సౌభ్రాతృత్వం మరింత బలపడాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం ఆలయం నిర్మించడం గొప్ప విషయం అని రవికుమార్ గుప్తను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు,నాయకులు, భక్తులు పాల్గొన్నారు.






