07-05-2025 12:00:00 AM
జగిత్యాల, మే 6 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం యువత కోసం నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్మీ ఉద్యోగం ‘అగ్నివీర్’కు ఎంపికైన యువకుడిని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభినందించారు. జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ గ్రామానికి చెందిన రామడుగు గంగాధర్ కుమారుడు మనోహర్ ఇటీవల నిర్వహించిన ఆర్మీ ఉద్యోగ నియామక పరీక్ష రాసి, ఉత్తీర్ణుడై ‘అగ్నివీర్’కు ఎంపికయ్యాడు.
కాగా మనోహర్, ఆయన తల్లిదండ్రులు ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మనోహర్’ను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత సైన్యంలో ఎంపికై దేశానికి సేవ చేయడం ఎంతో గర్వకారణమన్నారు.
మనోహర్ లాంటి యువకులను ప్రతి ఒక్కరూ ఇతన్ని ఆదర్శంగా తీసుకొని భారత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మాజీ సర్పం రాజేశ్వర్ రెడ్డి తదితరులున్నారు.