calender_icon.png 9 May, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి రవాణా కేసులో ఒకరి అరెస్ట్

07-05-2025 12:00:00 AM

సిరిసిల్ల, మే 6 (విజయక్రాంతి): గంజాయి అక్రమ రవాణా కేసులో. హమ్మద్ ను అరెస్ట్ చేసినట్టు సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ తెలిపారు.అనే వ్యక్తిపై జిల్లాలోని సిరిసిల్ల,ఎల్లారెడ్డిపేట,తంగాలపల్లి,బోయినపల్లి,చందుర్తి పోలీస్ స్టేషన్ లలో 15 కేసులు నమోదు కాగా సిరిసిల్ల పట్టణ పోలీ స్ స్టేషన్లో 04 కేసులలో,చందుర్తి పోలీస్ స్టేషన్లో 01కేసులో పరారీలో ఉండగా సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో సిరిసిల్లకి వస్తున్నాడన్న సమాచారం మేరకు హమ్మద్ పట్టణంలోని ఎల్లమ్మ చౌరస్తా వద్ద అరెస్ట్ చేసి విచారణ అనంతరం రిమాండ్ కి తరలించడం జరుగుతుందన్నారు..

జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట  నిఘా ఏర్పాటు చేసి గంజాయి అక్రమ ర వాణాపై స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుదన్నారు.