calender_icon.png 8 May, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురమల్ల సస్పెన్షన్

07-05-2025 12:00:00 AM

కరీంనగర్, మే 6 (విజయక్రాంతి) : కరీంనగర్ అసెంబ్లీ ఇంఛార్జి పురుమళ్ల శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో నెలకొన్న గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టడంలో భాగంగా శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారని తెలుస్తోంది. గతంలో షోకాజ్ నోటీసులు ఇవ్వగా పురుమళ్ల శ్రీనివాస్ క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డికి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని స్పష్టం చేశారు.

శ్రీనివాస్ వైఖరిని మార్చుకునేందుకు పార్టీ తగినంత సమయం ఇచ్చినప్పటికీ మార్పు రాలేదని గమనించామని, ఈ కారణంగానే పార్టీ నుండి సస్పెండ్  చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా పురుమళ్ల శ్రీనివాస్ చేసిన ఆరోపణల విషయంలో పీసీసీ క్రమ శిక్షణా సంఘం తీసుకున్న నిర్ణయంతో సస్పెన్షన్ వేటు వేశారు.