calender_icon.png 13 December, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

13-12-2025 03:41:30 PM

 ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

నూతనంగా గెలిచిన సర్పంచులను అభినందించిన ఎమ్మెల్యే

చొప్పదండి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(MLA Medipally Sathyam) అన్నారు. చొప్పదండి నియోజకవర్గం లోని వివిధ గ్రామాల్లో నూతనంగా గెలుపొందిన సర్పంచులు శనివారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను గంగాధర లోని ప్రజా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచులను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి అభినందించారు. ఆయా గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరిస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

చొప్పదండి నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు చెందిన నూతన సర్పంచులు  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గంగాధర ప్రజా కార్యాలయంలో  నూతన సర్పంచులకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.  చొప్పదండి నియోజకవర్గం లోని గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరిస్తామని భరోసా ఇచ్చారు.