మొయినాబాద్‌లో విత్తన మేళా షురూ
నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు
మొయినాబాద్, జూన్ 23(విజయక్రాం తి): రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొయినాబాద్ రైతు వేదికలో మంగళవారం విత్తన మేళా ఘనంగా ప్రారంభమైంది. జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ మేళా కొనసాగనుంది. నాణ్యమైన విత్తనాల ప్రదర్శన, వరి సన్న ర కాలైన తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్ 1504 8), కేఎన్‌ఎం1638, హెచ్‌ఎమ్టీ సోనా, డ బ్ల్యూజీఎల్44, బీపీటీ5204లతో పాటు ప ప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయ ల విత్తనాలను అందుబాటులో ఉంచారు.
ఆధునిక ఎరువులు:
సాంకేతికతను జోడించిన నానో యూరి యా, నానో డీఏపీ వంటి ఎరువులను కూడా ఇక్కడ ప్రదర్శించారు.మండల వ్యవసాయ అధికారి పి. అనురాధ మాట్లాడుతూ రైతులు ధృవీకరించిన విత్తనాలను మాత్ర మే కొనుగోలు చేసి అధిక దిగుబడులు సాధించాలని కోరారు. వ్యవసాయ విస్తరణ అధికారి దీనా రైతులకు సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. స్థానిక డీలర్లు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక స్టా ళ్లకు మండల పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో హాజరై వివరాలు సేకరించారు. కార్యక్రమంలో అధికారులు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.






