calender_icon.png 15 July, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఇష్టంతో చదవాలి..!

24-06-2025 03:19:14 PM

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే దంపతులు

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నిరుపేద విద్యార్థులు వారి తల్లిదండ్రులు కుటుంబ పోషణ కోసం పడుతున్న కష్టాన్ని గుర్తించి ఇష్టపడుతూ చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూచుకుళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి సతీమణి సరితతో కలిసి స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు తరగతి గది నుంచే విలువలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. ఈ చిన్నారుల భవిష్యత్తు పట్ల మన అందరి  బాధ్యత ఉందని ఎమ్మెల్యే సతీమణి డా. సరిత అన్నారు. కూచుకుళ్ల ఫౌండేషన్ తరఫున ఈ సేవా కార్యక్రమం విద్యార్థుల్లో విద్యపట్ల ఆసక్తిని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.