8 April, 2026 | 2:16 AM

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

08-04-2026 12:00 AM

ఇల్లందు టౌన్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం లబ్ధిదారులకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదరిక కుటుంబానికి సహాయం అందిస్తున్నామని తెలిపారు.

టౌన్కు చెందిన 26 మందికి రూ.7,63,500, మండలానికి చెందిన 77 మందికి రూ.25,53,000 చొప్పున మొత్తం 103 మంది లబ్ధిదారులకు రూ.33,16,500 విలువైన చెక్కులు పంపిణి చేశారు, కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ దొడ్డా కిరణ్ మిత్ర డానియల్, వైస్ చైర్మన్ పెండేల రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.