29 May, 2026 | 2:56 AM

చర్లలో శ్రీ ధన్వంతరి డెంటల్ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం

29-05-2026 12:00 AM

చర్ల: మే 28( విజయక్రాంతి) : చర్ల రఘు థియేటర్ రోడ్లో డాక్టర్ పెద్దాడ గీత ఆనంద్  నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ధన్వంతరి డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు  రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ను ప్రారంభించారు.

అనంతరం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక దంత వైద్య పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందుబాటులోకి తేవడం అభినందనీయమని, డాక్టర్ గీత ఆనంద్ సేవలు చర్ల ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ పెద్దాడ గీత ఆనంద్  మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలలో నాణ్యమైన దంత వైద్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.