మహాలక్ష్మి తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు
చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని సాదు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమం శనివారం ప్రారంభమైంది, ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి సందర్భంగా అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చందుర్తి మండల కేంద్రంలో గత 22 సంవత్సరాల నుండి తొలి ఏకాదశి సందర్భంగా అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.
అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండి. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. అఖండ భజన కార్యక్రమాన్ని చేపట్టిన బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి పులి సత్యం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుట్టే ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి నాగం కుమార్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, సాదు సజ్జన భజన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






