25 July, 2026 | 5:26 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

అశ్వాపురం మండలంలో ఘనంగా ఎన్‌టీఆర్ జయంతి

29-05-2026 12:00 AM

అశ్వాపురం మే 28 (విజయక్రాంతి):  నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా గురువారం అశ్వాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేకంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్లాల్, ఉపసర్పంచ్ తుళ్లూరి ప్రకాష్రావు, మాజీ ఎంపీటీసీ తుళ్లూరి గంగాభవాని, మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత, ముత్తినేని వాసు, టిడిపి నాయకులు వాసు, రాయల సత్యనారాయణ, సాయిని సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటం ముందు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ అభిమానులు సంబరాలు నిర్వహించారు.