15-12-2025 12:15:12 AM
సంగారెడ్డి, డిసెంబర్ 14 :తెల్లాపూర్ పరిధిలో మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వన్ ఛాంపియన్ క్రికెట్ అకాడమిని ఆదివారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ పరిధిలో క్రీడలకు సంబంధించిన అకాడమీలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.
విద్యార్థి దశ నుండి క్రీడలవై ఆసక్తి పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సోమిరెడ్డి, మల్లారెడ్డి, నాగరాజు, బాబ్జీ, కొమరయ్య, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.