లీకులపై కిషన్ రెడ్డి ఆగ్రహం
16-12-2025 11:52 AM
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఎంపీల సమావేశ లీకులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ లో జరిగిన విషయాలు బయటకు చెప్పొద్దని ప్రధాని చెప్పారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని చెప్పినా.. మీటింగ్ లో విషయాలను బయటకు చెప్పారని ఆరోపించారు. బయటకు చెప్పినవారు ఎవరో చెబితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాని మీటింగ్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని చెప్పారని, తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రధాని కోరారని తెలిపారు. దక్షిణ భారత్ నుంచి ఇప్పటివరకు ఇద్దరు ఉపరాష్ట్రపతులు అయ్యారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు.




