15-12-2025 12:14:10 AM
జనగామ ఎమ్మెల్యే పల్లా
చేర్యాల,డిసెంబర్ 14:జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల మండలంలోని గ్రామాలలో ఆదివారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి బిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపుకై విశ్రుతంగా ప్రచారం చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతు మోసపు మాటలు చెప్పి ప్రజలను పదే పదే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకీ ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.
దయచేసి ఆలోచన చేయండి గతంలో బిఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ఒకసారి పోల్చి చూసి మీ ఓటు వేయండి అని ప్రజలను కోరారు.ఎవరు పని చేశారు? ఎవరు మాటలు మాత్రమే చెప్పారు? ప్రజలకు మేలు ఎవరు చేశారు?
గ్రామాల అభివృద్ధిని ఎవరు తీసుకువచ్చారు?అన్నది మీకే స్పష్టంగా తెలుసు అని గ్రామాల భవిష్యత్తు కోసం,స్థిరమైన అభివృద్ధి కోసం నిజాయితీతో పనిచేసే స్థానిక నాయకత్వం కోసం బిఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ వార్డు అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిచాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ వార్డు అభ్యర్థులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.