24 March, 2026 | 4:33 AM

మల్లన్న గుట్ట జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎంఆర్

24-03-2026 01:09 AM

పటాన్చెరు, మార్చి 23 : ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంబండ గ్రామ పరిధిలో గల మల్లన్న గుట్ట స్వామి దేవాలయంలో సోమవారం నిర్వహించిన స్వామి వారి కల్యాణోత్సవం, జాతర మహోత్సవం లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మ హిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ ధర్మకర్త, కౌన్సిలర్ అంతిరెడ్డి ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యు లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.