11 March, 2026 | 2:51 PM

Breaking News

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •  

మెడికల్ సీటు సాధించిన విద్యార్థినిని అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు

27-10-2024 08:32 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ కి చెందిన విద్యార్దిని చెవిటి లిఖిత ఈ ఏడాది జరిగిన నీట్‌ పరీక్షలో ఉత్తమ ప్రతిభను కనబరిచి మెడిసన్‌లో సీటు సాధించింది. ఈ మేరకు ఆదివారం సిద్దిపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు లిఖితను అభినందించి, శాలువాతో సత్కరించారు. విద్యార్థిని తల్లిదండ్రులు చెవిటి రాజు రేణుక  కుల వృత్తిని  చేసుకుంటు కుటుంబాన్ని సాగిస్తున్నారు. ఈ మేరకు లిఖిత నీట్‌ పరీక్ష లో మంచి ర్యాంక్ సాధించి వరంగల్  జిల్లాలోని ప్రతిమ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీట్‌ సాధించింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు లిఖితను అభినందించారు. సిద్దిపేట జిల్లాలోని విద్యార్థినీ, విద్యార్థులు లిఖితను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స  బీఆర్ఎస్ నాయకులు భుంపల్లి శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.