రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయింది.. గ్యారంటీలన్నీ తుస్సే
23-05-2024 04:05 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలన్నీ తుస్సే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని హరీశ్ రావు మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అభాసుపాలయ్యిందన్నారు. ఉద్యోగస్థుల డీఏల కోసం బీఆర్ఎస్ పోరాడిందని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేవలం సన్న ధాన్యానికే బోనస్ ఇస్తామంటున్నారు.. రాష్ట్రంలో 99.99 శాతం దొడ్డు వడ్లే పండుతాయని సూచించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని హరీశ్ రావు అన్నారు.






