24 July, 2026 | 3:25 AM

వాటర్ వర్క్స్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

24-07-2026 12:00 AM

కూకట్‌పల్లి, జూలై 23 (విజయక్రాంతి): కూకట్పల్లి నియోజకవర్గంలోని త్రాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం వాటర్ వరక్స్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ తో ఆయన కార్యాలయంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న త్రాగునీరు,డ్రైనేజీ సమస్యలను డైరెక్టర్ దృష్టికి తీసుకోవచ్చారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, సమస్య ఉన్నచోట కొత్త పైపులైనుల నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వాలని కోరారు. ప్రధానంగా త్రాగునీరు వచ్చే సమయంలో వాటర్ ప్రెషర్ విషయంలో తక్కువ రావడంతో ప్రజలకు నీటి సరఫరా సరిగా జరగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ప్రధానంగా వర్షాకాలంలో డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చోట సత్వరమే నిధులు కేటాయించి సమస్యలను పరిష్కరించాలని  అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వరక్స్ డైరెక్టర్ నారాయణ, జి ఎం హరి శంకర్, డీజీఎంలు, మాజీ కార్పొరేటర్లు మందాడి శ్రీనివాసరావు, జూపల్లి సత్యనారాయణ, సబిహా గౌసద్దీన్, ఆవుల రవీందర్ రెడ్డి, పగుడాల బాబురావు, తూము శ్రావణ్,   వాటర్ వరక్స్ అధికారులు పాల్గొన్నారు.