10 July, 2026 | 3:08 AM

మధురానగర్‌లో జిమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

10-07-2026 01:15 AM

జూబ్లీహిల్స్, జూలై 9 (విజయ క్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని మధురానగర్‌లో నూతనం గా లెవల్ ఎక్స్ ఫిట్నెస్ జిమ్ ను ఏర్పా టు చేశారు. జిమ్ ప్రారంభోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జిమ్ ను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవనశైలి లో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. అందుకు ఫిట్నెస్ సెంటర్లు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన లెవల్ ఎక్స్ ఫిట్నెస్ జిమ్ యువత ఆదరణ పొందాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.