01-08-2025 10:28:45 PM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని క్రిస్టియన్ పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన పంచతత్వ పార్క్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహబూబ్ నగర్ నగరం సుందరీకరణలో భాగంగా ఈ పార్కు ఏర్పాటు చేయడం జరిగిందని, నగరంలో మరికొన్ని పార్కులను ఏర్పాటు చేస్తామని గతంలో ఎన్నడూ లేనివిధంగా కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతంగా మహబూబ్ నగర్ అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పార్కులో చిన్నారులకు మంచి కాలక్షేపం దొరుకుతుంది అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, సంజీవరెడ్డి, శరత్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.