calender_icon.png 2 August, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం

01-08-2025 10:30:04 PM

ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): సుప్రీం కోర్ట్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు 1న ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఆగస్టు 1ని విద్రోహ దినంగా భావిస్తూ ఇల్లందు మాల మహానాడు నేతలు శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు నేతలు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధమని పార్లమెంటులో ఆమోదించాల్సిన వర్గీకరణ బిల్లును, సుప్రీంకోర్టు ద్వారా తీర్పును ఇవ్వడం వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఏకపక్ష రోస్టర్ విధానంలో మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నేతలు వేమూరి సాల్మన్ రాజ్, కమలాకర్, అబ్బూరి సునీల్ , రామకృష్ణ, శ్యామ్ కుమార్, సంతోష్, వీరభద్రం, ప్రవీణ్, మైప బాలరాజు తదితరులు పాల్గొన్నారు.