calender_icon.png 25 August, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే

25-08-2025 12:00:00 AM

మెదక్, ఆగస్టు 23(విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం  ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఆదివారం హవేళీఘణపూర్ మండలం రాజ్పేట తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు.

ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వంగా సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. గత పదేళ్ళలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందన్నారు. రాజ్పేట తండాలో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 

తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..

రాజ్పేట తండాలో గిరిజనులు జరుపుకునే తీస్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు, గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా  స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళలు, తండావాసులతో కలిసి నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.