20 June, 2026 | 2:36 AM

రంగధాముని చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

20-06-2026 12:00 AM

కూకట్‌పల్లి, జూన్ 19 (విజయక్రాంతి): కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గ పరిది రంగదాముని (ఐడియల్) చెరువు వద్ద హైడ్రా చేపడుతున్న పనులను శుక్రవారం పరిశీలించారు. అనంతరం కృష్ణారావు మాట్లాడుతూ  చెరువు అభివృద్ధి కోసం  బి ఆర్ ఎస్ హయాంలో రూ.19 కోట్ల రూపాయలు కేటాయించామని అందులో రూ. 9 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు చేపట్టామని మిగతా డబ్బులతో చెరువును అభివృద్ధి చేయాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువు అభివృద్ధి విషయంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐడియల్ చెరువును అత్యంత సుందరంగా తీర్చిదిద్దామన్నారు.హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ తర్వాత రంగదా ముని చెరువులనే వినాయక నిమజ్జనాలు, బతుకమ్మ నిమజ్జనాలు  ఎక్కువగా జరుగుతాయని అందుకు సంబంధించి ఐదు ఎకరాల స్థలం కేటాయించి పాండు నిర్మించా లని సూచించారు. మియాపూర్ ప్రాంతం నుండి వచ్చే వరద నీరు హెచ్‌ఎండిఏ, వాట ర్ వర్క్  అధికారుల సమన్వయ లోపం వల్ల న్యూ బాలాజీ నగర్ లో వరదల పారుతుందని మురుగునీటి వరదతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారన్నారు.

దానిని సరి చేయాల్సిన బాధ్యత వాటర్ వరక్స్ అధికారులపై ఉందని సూచించారు. ఎఫ్‌టిఎల్ స్థలా న్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత హైడ్రాదేనని, చెరువు సుందరీకరణ హైడ్రా ను అభినందిస్తూ సుందరీకరణ పనులను  త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబా టులోకి తీసుకురావాలని సూచించారు. నగరం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఈ ప్రాంతంలో అత్యధికంగా అపార్ట్మెంట్లు వెలిశాయని దాంతో నీటి వినియోగం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. చెరువు వద్ద ఎస్ టి పి ప్లాంట్ ద్వారా వచ్చే నీటిని నిలువ చేసే విధంగా 50ఎం ఎల్  సామర్థ్యం గల స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల  బాబురావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభా కర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, హైడ్రా, హెచ్‌ఎండిఏ, వాటర్ వర్క్స్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.