20 June, 2026 | 2:37 AM

విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు

20-06-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, జూన్ 19(విజయక్రాంతి) : విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం  హవేళీఘనపూర్ మండలం పోచంరాల్ తండాకు చెందిన విద్యార్థి బడావత్ రాఘవేందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బూరుగుపల్లిలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని, బీసీ హాస్టల్లో నివసిస్తూ విద్యను అభ్య సించాడు.

పదవ తరగతిలో ఉత్తమ మార్కు లు సాధించినందుకు, జిల్లా డీఆర్డీఏ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ కాలేజెస్ (BAC) పథకం ద్వారా హైదరాబాద్ బోడుప్పల్లోని ఎస్.ఆర్. జూనియర్ కళాశాలలో ఉచిత సీ టు పొందాడు. ప్రభుత్వ సహకారంతో ఇం టర్మీడియట్ విద్యను విజయవంతంగా పూ ర్తి చేశాడు. తెలంగాణ ఈఏపీసెట్ (EAPC ET) పరీక్షలో సుమారు 2000 లోపు ర్యాం కు సాధించాడు. జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించి, జేఈఈ అడ్వానస్డ్ పరీక్షలో కూడా మంచి ప్రతిభ కనబరిచాడు.

ప్రతిష్ఠాత్మకమై న ఐఐటీ వారణాసి (BHU) లో కంప్యూటింగ్ అండ్ మ్యాథమెటిక్స్ బ్రాంచ్లో ప్రవేశం పొందాడు. ఈ సందర్భంగా విద్యార్థి నేడు మెదక్ జిల్లా కలెక్టర్  ప్రతిమ సింగ్ ను మ ర్యాదపూర్వకంగా కలిశాడు. కలెక్టర్ మారుమూల గ్రామం నుంచి ఐఐటీ వారణాసి వరకు అతని విద్యా ప్రస్థానాన్ని అభినందిస్తూ, ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని, విద్య ఒక మనిషిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందని విద్యార్థికి సూచించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు.  ఈ కార్యక్రమంలో ౄRO అంబాదాస్ రాజేశ్వర్, జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజే షన్ అధికారి రాజు, ఏఎస్‌ఓ నవీన్, జిల్లా అడల్ట్ ఎడ్యుకేషన్ అధికారి మురళీమోహన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బూరుగుపల్లి  ప్రధానోపాధ్యాయులు రమేష్, రాఘవేందర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.