20 June, 2026 | 2:22 AM

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

20-06-2026 12:00 AM

ఎస్‌ఐ వివేక్ హెచ్చరిక

నంగునూరు, జూన్ 19: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని రాజగోపాలపేట ఎస్‌ఐ టీ. వివేక్ అన్నారు.శుక్రవారం నంగునూరు మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను మండల వ్యవసాయ అధికారి వి.గీత తో కలిసి ఆయన  సంయుక్తంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు డీలర్లతో మాట్లాడుతూ..రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించరాదని, అధిక ధరలకు అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ప్రతి రైతుకు తప్పనిసరిగా విత్తనాల కొనుగోలు బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు.ప్రస్తుత సీజన్ లో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సన్నరకం విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.