22-05-2025 12:00:00 AM
మానకొండూర్, మే 21 (విజయ క్రాంతి): మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారా యణ బుధవారం మార్నింగ్ వాక్ లో భాగంగా తీగల వంతెన సమీపంలోని హజరత్ సయ్యద్ షేర్ అ లీ బాబా దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు, ద ర్గా కమిటీ బాధ్యులతో కలిసి ఆయ న ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.
దర్గా కమిటీ అధ్యక్షుడు వాజిద్ అలీతో కలిసి అన్యాక్రాంతానికి గురైన దర్గా భూమిని ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అన్యాక్రాంతానికి గురైన దర్గా భూమిని దర్గాకే చెందేట్లు చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణకు దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ వాజిద్ అలీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో షేర్ అలీ బాబా దర్గా కమిటీ ప్రధాన కార్యదర్శి నదీముద్దీన్, ఉపాధ్యక్షుడు ఎండి.ఇర్ఫాన్ మొహియుద్దీన్, అయూబ్ ఖాన్, సంయుక్త కార్యదర్శుల మీర్జా యూసుఫ్ బేగ్, ఎండి సలీం, కోశాధికారి అలీ, సలహాదారులు మౌలానా అలీముద్దీన్ నిజామి, లయిఖ్ ఎంఏ సలాం, సభ్యులు ఫహీం, ముసా,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, 6,7వ డివిజన్ల పార్టీ అధ్యక్షులు తమ్మనవేణి రమేశ్ కుమార్, బండి మల్లేశం, పార్టీ నాయకులు గోపు మల్లారెడ్డి, రామిడి తిరుపతి, వీణవంక రవీందర్, చిందం లింగయ్య, కంది అశోక్ రెడ్డి, కాత కొమురయ్య, కంది రవీందర్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.