calender_icon.png 23 May, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో పుణ్యశ్లోక రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు

22-05-2025 12:00:00 AM

భద్రాచలం, మే 21 (విజయ క్రాంతి) రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు (మే 21- మే 31) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి  కల్లెం విజయా రెడ్డి  భద్రాచలం నుండి ప్రారంభించారు. భద్రాచలానికి విచ్చేసి కళ్లెం విజయ రెడ్డి శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాముని ఆశీస్సులతో ఈ జయంతి ఉత్సవాల్ని ప్రారంభించడం జరిగింది.

అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అహల్యాబాయి హోల్కర్ స్ఫూర్తిదాయక జీవితాన్ని వివరించారు. అహల్యాబాయి 1725లో జన్మించి, మధ్యప్రదేశ్లోని ఇండోర్ సంస్థానాన్ని మూడు దశాబ్దాల పాటు ధర్మపరంగా పరిపాలించిన గొప్ప రాణి. ఆమె మహేశ్వర్ను రాజధానిగా చేసి, దేవాలయాల పునరుద్ధరణ, నదీ పరిరక్షణ, మహిళా శక్తికి ప్రాధాన్యం, పౌరుల సంక్షేమం వంటి పలు రంగాల్లో శాశ్వత సేవలు అందించారన్నారు.

రాజకీయం అనేది సేవగా భావించి, ధైర్యంగా పాలించిన అహల్యాబాయి జీవితాన్ని ప్రతి మహిళ, ప్రతి నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలి అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కుంజా ధర్మ, మహిళా మోర్చా జిల్లా కన్వీనర్ జల్లారపు శ్రీనివాసరావు, కో కన్వీనర్లు గూడ విజయ,

ముక్కెర కోటేశ్వరి, మహిళా మోర్చా నాయకులు కవిత, సునీత, బీజేపీ నాయకులు పసుపులేటి నాగబాబు, ములిశెట్టి రామ్మోహన్ రావు, చెల్లుబోయిన వెంకన్న, పి ఉపేంద్ర, డి వెంకటేశ్వరరావు, ఎమ్ భార్గవి తదితరులు పాల్గొన్నారు.