calender_icon.png 24 May, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాలను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. కార్మిక లోక పక్షాన ఉద్యమిస్తాం...

23-05-2025 10:31:08 PM

మాజీ చీఫ్ విప్, బీ ఆర్ ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్

హనుమకొండ,(విజయక్రాంతి): బీఆర్ఎస్ కార్మిక విభాగం హనుమకొండ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో బాలసముద్రం పార్టీ కార్యాలయంలో కార్మిక సంక్షేమ మహోత్సవంలో వివిధ కార్మిక సంఘాల నాయకుల సమావేశం జరిగింది. దాస్యం వినయ భాస్కర్  వివిధ సంఘాల నాయకులు చర్చించి తీసుకున్న తీర్మానాలు

రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానాలు..

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక  నాలుగు లేబర్ కోడ్లని   ఉపసంహరించుకోవాలి. ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీని ఆటో కార్మికులకు రూపాయలు 12,000/ తక్షణమే అమలు చేయాలి.ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్నటువంటి 14 రంగాల కార్మికులకి పెండింగులో ఉన్న బిల్లులను విడుదల చేయాలి. గత ప్రభుత్వం కేటాయించిన కార్మిక భవన స్థలంలో భవన నిర్మాణం జరిపించాలి. భవన నిర్మాణరంగా కార్మికుల అడ్డాలపై సౌకర్యాలు కల్పించి, వైద్య పరీక్షలు జరిపించి వైద్యం చేపించాలి. నగరంలోని చిరు వ్యాపారులపై దౌర్జన్యాన్ని ఆపి చిరు వ్యాపారస్తుల చట్టం 2014ని వెంటనే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అమలు చేయాలి. జిల్లాలోని ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చిరు వ్యాపారులకు వసతులు కల్పించాలి. అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి హోటల్ రెస్టారెంట్, షాపింగ్ మాల్స్ కార్మికులకి ఈఎస్ఐ,  పిఎఫ్  కనీస వేతనం రూపాయలు 26000/, 8 గంటల పని అమలు చేయాలి.

ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి. ఆశ, అంగన్వాడి, స్కీం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్లకు కనీస వేతనం 26000 చెల్లించాలి. పై తీర్మానాల హక్కుల సాధనకై ఈనెల 27వ తారీకు సోమవారం రోజున హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎస్ ఐ, పి ఎఫ్ సంస్థల అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈనెల 29న ఆటో కార్మికుల క్షతగాత్రుల కుటుంబాలను వినయ్ భాస్కర్ కలుసుకోవడం జరుగుతుంది. ఈ నెల 30 తారీఖున ఆటో కార్మికులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర ఆటో కార్మికులపై రైల్వే అధికారుల వేధింపులను వెంటనే ఉపసంహరించుకోవాలి.

 పలు సమస్యల పరిష్కారం కోసం దాస్యం వినయ్ భాస్కర్ కార్మికుల పక్షాన హక్కుల సాధనకై వెన్నంటే ఉంటానని కార్మికులు అందరూ ఐక్యంగా సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సమావేశాలు సదస్సులు సమావేశాలు సదస్సులు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తాము. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూన్ 9న భారత రాష్ట్ర సమితి కార్మిక అనుబంధ విభాగం పాల్గొని విజయవంతం చేస్తుంది. ఈనెల 31 తారీకు రోజున అన్ని కార్మిక సంఘాల ముగింపు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశ అధ్యక్షులు నాయిని రవి, నాయకులు ఇంజాల మల్లేశం, ఈసంపల్లి సంజీవ, మహమూద్  ఇస్మాయిల్, తేలు సారంగపాణి, జి నరహరి, రవీందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, రఘు, శివకుమార్, రాజారపు రాజు, శ్రీధర్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.