calender_icon.png 24 May, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో పాలరాజ్ వర్ధంతి వేడుకలు

23-05-2025 10:22:50 PM

భద్రాచలం,(విజయక్రాంతి): వేమూరు మాజీ శాసనసభ్యులు, పాల్ రాజ్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు దివంగత డాక్టర్ పాల్రాజ్ వర్ధంతి వేడుకలు స్థానిక సెయింట్ పాల్స్ చర్చి నందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుతగా ఆయన స్థాపించిన గుడ్ సమారిటన్ ఎవలాంజెలికల్ లూథరన్ సంఘం సభ్యులు ఆయన సమాధి వద్ద పూలతో అలంకరించి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సంఘ ప్రార్థన మందిరంలో సంఘ అధ్యక్షులు రెవరెండ్ రాధ మంజరి అధ్యక్షతన సంస్మరణ కార్యక్రమం నిర్వించారు. ఈ కార్యక్రమంలో సంఘ పరిపాలన అధికారి అబ్రహం, పాల్రాజ్ విద్య సంస్థల చైర్మన్, పాల్రాజ్ కుమారుడు సోమరౌతు శ్రీనివాసరావు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో సాంకేతిక విద్య అందించిన వ్యక్తి అని అన్నారు. మన్యంలో యేసు ప్రభువు వాక్యాన్ని నలుమూలల వ్యాప్తి చేయడంలో ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన నిర్దేశించిన దారిలో నడవడమే ఆయనకు నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో తిమోతి, రమేష్, జోసెఫ్, రమేష్, పాస్టర్లు,సంఘ సభ్యులు పాల్గొన్నారు.