calender_icon.png 24 May, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూటకపు ఎన్కౌంటర్లు నిలిపివేయాలి

23-05-2025 09:05:24 PM

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

ఆపరేషన్ కాగర్ నిలిపివేయాలి

ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్

హుజురాబాద్,(విజయక్రాంతి): బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేసి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం అఖిలపక్ష సమావేశం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కాగార్ పేరుతో ఒకటి ఒకటి 2023 నుండి నేటి వరకు 486 పైగా అమాయక ఆదివాసుల, మావోయిస్టులను ఎన్కౌంటర్ రూపంలో కాల్చివేయబడ్డారని ఆపరేషన్ కాగర్  నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్కౌంటర్లు అమాయక ప్రజలపై సామూహిక హత్యకాండ పేర్కొన్నారు.

భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం అని పెద్ద రాజ్యాంగం, రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఆదేశిక సూత్రాలను రాజ్యాంగపరమైన చట్టపరమైన విధంగా పాలన ఉండాలని తెలిపారు. ప్రధానమైనది జీవించే హక్కు ఆర్టికల్ 21ని కల్పించబడిందని దీనికి పూర్తి విరుద్ధంగా అ ప్రజాస్వామికంగా ఎన్కౌంటర్ రూపంలో చంపుతున్నారని దీని ప్రజలు, ప్రజాసామికవాదులు, మేధావులు, సామాజిక వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు మావోయిస్టు పార్టీ తను కాల్పులను విరమిస్తూ శాంతి చర్చలకు సిద్ధమని అనేక పర్యాయాలు లేఖలు, వీడియోలు ద్వారా విజ్ఞప్తి చేసిన కేంద్ర ప్రభుత్వం మేధావుల శాంతి చేర్చిన కమిటీ ప్రతిపాదనలు విస్మరిస్తూ నేటికీ కాగర్ పేరుతో హత్యాకాండ కొనసాగిస్తుందన్నారు.

ఇందులో భాగంగా 21, 5,2025,రోజున చత్తీస్గడ్ రాష్ట్రంలో నాయనపూర్ జిల్లాలోని అబుజ్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబల, కేశవరావు తో పాటు 28 మంది ఎన్కౌంటర్ల రూపంలో హత్య గావించబడ్డారని ఆవేద వ్యక్తం చేశారు. ఇవి ఎన్కౌంటర్లు కావని ఏకపక్షంగా పట్టుకొని కాల్చి చంపినట్లుగా అర్థమవుతుందని ఈ ఎన్కౌంటర్లను సిట్టింగ్ జడ్జిచే న్యాయవిచారా జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు ముక్కెర రాజు, వేల్పుల రత్నం, తునికి సమ్మయ్య, పసుల స్వామి, సందెల వెంకన్న, సత్తిరెడ్డి, మలుగు రమేష్, వేల్పుల ప్రభాకర్, కొల్లూరు బుచ్చయ్య, గడ్డం సంజీవ్, ఎలగందుల కిష్టయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.